Asianet News TeluguAsianet News Telugu

జుత్తాడ కేసు: నేడు అప్పలరాజును కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

అత్యంత దారుణంగా ఆరుగురిని హత్య చేసిన ఘటనలో నిందితుడు అప్పలరాజును విశాఖపట్టణం పోలీసులు  బుధవారం నాడు  కస్టడీలోకి తీసుకోనున్నారు. 

Appalaraju will be taken into custody by the Visakhapatnam police today lns
Author
Visakhapatnam, First Published Apr 28, 2021, 9:25 AM IST

విశాఖపట్టణం: అత్యంత దారుణంగా ఆరుగురిని హత్య చేసిన ఘటనలో నిందితుడు అప్పలరాజును విశాఖపట్టణం పోలీసులు  బుధవారం నాడు  కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 16వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని జుత్తాడలో విజయ్ కుటుంబాన్ని అప్పలరాజు అత్యంత దారుణంగా హత్య చేశాడు. చిన్నారులు సహ ఆరుగురిని హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.  

also read:విశాఖ హత్యలు: వాళ్లని కూడా అరెస్ట్ చేయాలి.. పోస్ట్‌మార్టానికి అంగీకరించని విజయ్

తన కూతురికి వివాహం జరగకపోవడానికి విజయ్ కారణమనే  కోపంతో అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను  పోలీసులు అప్పలరాజును  కస్టడీలోకి తీసుకోవాలని  కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. 

ఇవాళ అప్పలరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. విజయ్ కుటుంబాన్ని హత్య చేయడానికి కారణాలపై అప్పలరాజు నుండి రాబట్టనున్నారు. మరో వైపు  అప్పలరాజును కఠినంగా శిక్షించాలని విజయ్ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కలెక్టరేట్ వద్ద కొడుకుతో కలిసి విజయ్  గతంలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. మరో వైపు  బాధిత కుటుంబం మంత్రి అవంతి శ్రీనివాస్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios