అసెంబ్లీలో మార్షల్స్‌ను టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్జీవో) ఆగ్రహం వ్యక్తం చేసింది.

చంద్రబాబు ‘‘బాస్టర్డ్’’ అని ఒక ప్రభుత్వోద్యోగిని తిట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఎన్జీవో ఒక ప్రకటనలో తెలిపింది. విధులలో ఉన్న ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు మనోవేదనకు గురిచేసిన ప్రతిపక్షనేత బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Also Read:ట్విట్టర్ ఇండియా టాప్ ట్రెండ్స్‌లో #APDishaAct

40 సంవత్సరాల రాజకీయ అనుభవం వుందని చెప్పే చంద్రబాబు, ఆయన అనుభవం ఉద్యోగులను తిట్టడానికి పనికివచ్చిందా.. ఏ ఉద్యోగిని అవమానించినా ఏపీఎన్జీవో సంఘం ఊరుకోదని హెచ్చరించారు. 

Also Read:నేను దీక్షలో..రాపాక అసెంబ్లీలో: షోకాజ్ నోటీసులపై పవన్ కళ్యాణ్

కాగా తాను ప్రభుత్వోద్యోగిని బాస్టర్డ్ అన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తానెక్కడా ఆ పదాన్ని ఉపయోగించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చెప్పుతో కొట్టాలి.. నడిరోడ్డుపై ఉరేయ్యాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఉన్మాది అంటే పౌరుషం పొడిచుకొచ్చిందని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. తాను అనని మాటను పట్టుకుని జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆయన సీఎం పదవికి అనర్హుడని చంద్రబాబు మండిపడ్డారు.