Asianet News TeluguAsianet News Telugu

జనసేన పార్టీపై రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. 84 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ భరోసాయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. 

apcc chief raghu veerareddy comments on janasena party
Author
Amaravathi, First Published Feb 2, 2019, 7:21 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సైరన్ మోగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు తాము సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను తయారు చేసేందుకు పీసీసీ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. 

ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్ని పార్టీల కంటే తామే ముందు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7నుంచి 10వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 

ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందన్నారు. 

ఎంపికైన అభ్యర్థులకు ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమం బాధ్యతలు అప్పగిస్తామని, అభ్యర్థులు నేరుగా రాహుల్‌గాంధీతో అనుసంధానమయ్యేలా చేస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 4నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్రం చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఈ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. 84 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ భరోసాయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి తమకి పోటీ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లపైగా చరిత్ర ఉంటే జనసేన పార్టీ ఇంకా మెులకెత్తలేదని రఘువీరారరెడ్డి విమర్శించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios