Asianet News TeluguAsianet News Telugu

అమర్‌నాథ్ యాత్రలో ఏపీ మహిళ మృతి, శంషాబాద్‌కు భౌతికకాయం

అమర్‌నాథ్ యాత్రలో తెలుగు మహిళ ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌-1కు చెందిన పెండ్లిమరి భాగ్యమ్మ జూన్ 26న తన భర్త శంకరయ్యతో పాటు అమర్‌‌నాథ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు.

ap women died due to cardiac arrest during Amarnath Yatra
Author
Srinagar, First Published Jul 4, 2019, 2:43 PM IST

అమర్‌నాథ్ యాత్రలో తెలుగు మహిళ ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌-1కు చెందిన పెండ్లిమరి భాగ్యమ్మ జూన్ 26న తన భర్త శంకరయ్యతో పాటు అమర్‌‌నాథ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు.

కడప నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ చేరుకున్న వారు .. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్‌లోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు వెళ్లారు. అనంతరం అమర్‌నాథ్‌కు వెళ్లాల్సి వుంది.. అయితే బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భాగ్యమ్మకు గుండెపోటు వచ్చింది.

దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సహాయక బృందం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సోనామార్గ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం ప్రత్యేక ఎయిర్‌బస్ ద్వారా హైదరాబాద్‌ విమానాశ్రయానికి భాగ్యమ్మ భౌతికకాయం చేరుకోనుంది.

సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు తహసీల్దార్ మృతిరాలి వివరాలు సేకరించాల్సిందిగా స్థానిక వీఆర్వోను ఆదేశించారు. ఘటన గురించి జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు.

శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరులో భాగ్యమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మరణంతో స్ధానికంగా విషాద వాతావరణం చోటు చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios