ఇవాళ(గురువారం) తూర్పుగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 36, కృష్ణాలో జిల్లాలో 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 

అమరావతి: రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని ఐఎండి ప్రకటన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని విపత్తుల ‌శాఖ కమీషనర్ కె.కన్నబాబు సూచించారు. ఇవాళ(గురువారం) తూర్పుగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 36, కృష్ణాలో జిల్లాలో 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మొత్తం రాష్ట్రంలోని 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం వుందని ఐఎండి ప్రకటించినట్లు కన్నబాబు తెలిపారు. 

గురువారం నుండి ఆదివారం వరకు ఏపీలో వాతావరణ పరిస్థితులు:

గురువారం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C 

గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C 

 ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. 


శుక్రవారం

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C

విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C 

చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 

శనివారం

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C

 విశాఖపట్నం, , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C

 చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


ఆదివారం

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C 

 విశాఖపట్నం, , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C 

చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం