ఆంధ్ర ప్రదేశ్ లో నేడు సాధారణ వర్షపాతం నమోదు కానుందని... రానున్న రెండురోజుల్లో వర్ష ఉదృతి పెరగనున్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరించింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (ఆదివారం) వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో కోసరుతుపవన ద్రోణి ఉత్తరాది నుండి దక్షిణాది వైపు మళ్లిందని వాతావరణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో మరోసారి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... అందువల్లే మళ్లీ వర్షాలు మొదలయ్యాయని తెలిపారు.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శనివారం మాదిరిగానే ఆదివారం కూడా ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. అయితే ఈ వర్షాలు రోజురోజుకు మరింత పెరిగి రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలుగా మారనున్నాయని హెచ్చరించారు. ఈ వర్ష ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలో అధికంగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
read more శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి
ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరోసారి వాగులు వంకలు, నదులు ప్రమాదకరంగా మారాయి. మరోసారి వరద పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా వర్షాలు, సహాయక చర్యలపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు.
గతవారం కురిసిన భారీ వర్షాలు, వరదలను మరిచిపోకముందు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవడం ఆందోళన రేపుతోంది. మహోగ్రరేపం దాల్చిన గోదావరి శాంతిస్తున్న సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి పెరిగింది. ఇక కృష్ణా నదికి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నదీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వర్షం వస్తే వణికిపోతున్నారు. గత 100 ఏళ్లలో రాని వరద గోదావరి నదికి పోటెత్తింది. దీంతో గత వారం భద్రచలం వద్ద గోదావరి నది 70 అడుగులు దాటి ప్రవహించింది. ఆదిలాబాద్ జిల్లా నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల వరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరికి వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఈనెల 26న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. మరో వైపు ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
