Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రానున్న నాలుగురోజులు భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ap weather report... heavy rains in further four days akp
Author
Amaravati, First Published Jun 11, 2021, 9:34 AM IST

విశాఖపట్నం: తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది వుందని... దీని ప్రభావంతో శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 

read more   పూర్తిగా విస్తరిస్తున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ తీపికబురు

ఈ వర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. నాలుగురోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios