Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రాజెక్ట్‌లను ఆపండి: కేంద్రానికి ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌లను నిలిపివేయాల్సిందిగా కేంద్ర నీటిపారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. 

ap water users association letter to central over krishna water dispute
Author
Amaravati, First Published May 24, 2020, 3:32 PM IST

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌లను నిలిపివేయాల్సిందిగా కేంద్ర నీటిపారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఆంధ్ర రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.

సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాసు 6 టీఎంసీలు, తుమ్మిళ్ల  ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు.

అలాగే ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర పథకాల విస్తరణకు 105 టీఎంసీల సామర్ధ్యంతో మొత్తం 250 టీఎంసీలతో ప్రాజెక్ట్‌లు పూర్తయితే శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ కింద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 3.97 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 15.71 లక్షల ఎకరాలు ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం వుందని సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లను ఆపి చట్ట ప్రకారం దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను కాపాడాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios