ఏపీ శాసన మండలిలో మరోసారి అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఏపీ వ్యాట్ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా 4 ఓట్లు పోలయ్యాయి. మండలి నుంచి బీజేపీ వాకౌటయ్యింది.

కాగా, నిన్న వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి బొత్స ప్రవేశపెట్టిన పురపాలక పన్నుల సవరణ చట్టం బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. బిల్లును టీడీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు, అనుకూలంగా 11 మంది ఎమ్మెల్సీలు ఓట్లు వేశారు. ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉన్నారు.