ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా..

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్పీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే టెట్ ఫలితాలు కూడా మరింత ఆలస్యం కానున్నాయి. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించకూడదని, టెట్ ఫలితాలు విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

AP TET results, DSC exam postponed..ISR

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్  ముగిసేంత వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష ను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అలాగే టెట్ ఫలితాలను కూడా విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

లోక్ సభ ఎన్నికలు.. రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..

ఈ మేరకు ఎన్నికల సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న 6100 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దాని కోసం ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా ప్రభుత్వం పడిపోతుంది - ఏలేటి మహేశ్వర్ రెడ్డి

అయితే ఈ నెల 20 నుంచి 25 తేదీల్లో పరీక్ష కేంద్రాలకు వెబ్ ఆప్షన్లు, హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో వెబ్ ఆప్షన్లు పెట్టే ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా టెట్ ఫలితాలు, డీఎస్సీని వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం..

కాగా.. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వెయ్యికి పైగా ఫిర్యాదులు అందినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios