మాచర్ల దాడి: తప్పించుకుని తెలంగాణలోకి టీడీపీ నేతలు

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావులపై దాడి జరిగింది. దాడి నుంచి తప్పించుకోవడానికి తాము తెలంగాణ పారిపోయి రక్షణ పొందాల్సి వచ్చిందని వారంటున్నారు.

AP TDP leaders escaped to Telangana state

మాచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై దుండగులు బుధవారంనాడు దాడి చేశారు. 

వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము దాడి నుంచి తప్పించుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లామని చెబుతున్నారు. తమకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. కారుపై ఓ వ్యక్తి పెద్ద కర్రతో దాడి చేయడం టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. 

Also Read: చంపేస్తారా, డీజీపీ సమాధానం చెప్పాలి: మాచర్ల ఘటనపై బాబు ఆగ్రహం

పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. గాయపడిన టీడీపీ శ్రేణులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో బొండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేకుండా పోయిందని బొండా ఉమా ఆరోపించారు. డీఎస్పీ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని, పోలీసులపై కూడా దాడి చేశారని ఆయన అన్నారు. 

వెంటపడి తమపై దాడి చేశారని బుద్ధా వెంకన్న అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎపీ నేతలు తెలంగాణకు వెళ్లి రక్షణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. 

Also read: మాచర్లలో బొండా, బుద్దా వెంకన్న కారుపై వైసీపీ దాడి: ఉద్రిక్తత

తమ పార్టీ నేతలపై దాడి మీద చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios