ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబును ఓడించడం ఏపీ ప్రజలు చేసిన తప్పంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

14 నెలలు జైల్లో వుండి వచ్చిన దొంగకి ఓట్లేశారని వ్యాఖ్యానించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) . ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకురావడం అంత ఈజీ కాదని అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబును ఓడించడం ఏపీ ప్రజలు చేసిన తప్పంటూ అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం అధికారంలోకి రాబోతున్నామని తెలిసి మొన్న అమలాపురంలో అల్లకల్లోలం సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఆ విధ్వంసం జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) మహానాడు (mahanadu)లో మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చాలా మంది చెప్పారని, వారిలో కొందరు గాలికి కొట్టుకుపోయారని , మిగిలిన కొందరు వాళ్లే భూస్థాపితమైపోయారని లోకేష్ అన్నారు. పసుపు జెండా చూస్తే ఎక్కడా లేని బలం వస్తుందని.. మన శరీరం కోస్తే పసుపు రక్తమే వస్తుందన్నారు. శవాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సీఎం అయ్యారని.. వైసీపీ అంటే ‘‘యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ ’’ అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: వైసీపీ అంటే ‘‘యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ ’’.. చంద్రబాబు రాముడైతే , జగన్ రాక్షసుడు : నారా లోకేష్

చంద్రబాబు నాయుడు రాముడులాంటి వ్యక్తని.. ఆయన పరిపాలించిన 14 ఏళ్లలో కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టలేదని లోకేష్ గుర్తుచేశారు. రాముడు వున్నప్పుడు రాక్షసుడు కూడా వుంటాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన దగ్గరి నుంచి జగన్ జేసీబీ పాలన చేస్తున్నాడని.. ప్రజావేదిక కూల్చాడని, అక్కడి నుంచి పేదల ఇళ్లపై పడ్డాడని ఫైరయ్యారు. చంద్రబాబుకు ముందు చూపుంటే .. జగన్‌కు మందు చూపు వుందంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. కన్నతల్లిని, చెల్లిని, అన్నదాతలను, యువతను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా వుందని లోకేష్ గుర్తుచేశారు

ఈ సమయంలో కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకురావడంతో నేతలు ఇబ్బందిపడ్డారు. స్వయంగా చంద్రబాబు వారిని కంట్రోల్ చేశారు. మహానాడుకు లక్షలాదిగా జనం తరలివచ్చారని.. ఈ జనాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సభ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో యుద్ధం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ యుద్ధంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.