జగన్ సామాజిక న్యాయ విద్రోహి అన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కార్పోరేషన్లకు సైతం నిధులు కేటాయించడం మోసమేనని ఆయన చురకలు వేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ మేరకు శనివారం ఓ లేఖ విడుదల చేసిన ఆయన.. జగన్ ను సామాజిక న్యాయ ద్రోహిగా అభివర్ణించారు. బీసీలను, దళితులను , గిరిజనులను, మైనార్టీలను జగన్ మోసం చేశారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. బీసీసీలకు 56 కార్పోరేషన్లు, 10 మంత్రి పదవులు ఇచ్చామని అదే సామాజిక న్యాయమని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 56 కార్పోరేషన్లు పెట్టి.. పది శాతం రిజర్వేషన్లలో కోత పెట్టడం ద్వారా 16,800 పదవులను దూరం చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కార్పోరేషన్లకు సైతం నిధులు కేటాయించడం మోసమేనని ఆయన చురకలు వేశారు.
ALso Read:సీఎం జగన్ బిడ్డ పేరును కూడా తీసుకొచ్చారు.. చంద్రబాబుకు 2024లో రాజకీయ సమాధే: కొడాలి నాని
అలాగే దళిత సబ్ ప్లాన్ నిధులు రూ.7,200 కోట్లు దారి మళ్లించి, 1,500 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొన్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. దీనితో పాటు ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రూ.1000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని.. 81 గురుకుల పాఠశాల భవిష్యత్ ను ప్రశ్నార్ధకంగా మార్చే కుట్ర జరుగుతోందని అచ్చెన్న ఆరోపించారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ. 1,483 కోట్లను కూడా దారి మళ్లించారని ఏపీ టీడీపీ చీఫ్ ఆరోపించారు. వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎన్నో పథకాలను రద్దు చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
