ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది.


అమరావతి: ఏపీ రాష్ట్రానికి చెందిన టెన్త్ క్లాస్ ఫలితాలు శుక్రవారం నాడు విడుదలకానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు.గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడ టెన్త్ క్లాస్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోపుగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయలేమని భావించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:ఏపీ: రేపు టెన్త్ ఫలితాలు విడుదల

టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సూచనల మేరకు విద్యార్థులకు మార్కులను కేటాయించారు. విద్యార్థులకు ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని హైపవర్ కమిటీ సూచించింది.ఫలితాల విడుదల తర్వాత www.bse.ap.gov.in వెబ్‌పైట్ నుండి మార్కుల షీట్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.