ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల: ఏప్రిల్ 3 నుండి పరీక్షలు
వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఏపీ ఎస్ఎస్ సీ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ ను ప్రకటించింది.
అమరావతి: వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు శుక్రవారం నాడు ప్రకటించింది. ఏప్రిల్ 3 నుండి 18వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఏప్రిల్ 3న మొదటి లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించనున్నార. ఏప్రిల్ ఆరున సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఇంగ్లీష్, 10వ తేదీన గణితం, ఏప్రిల్ 13న సామాన్యశాస్త్రం, ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను మార్చి 15 తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 15వ తేదీన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుండి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్టుగా ఇంటర్ బోర్డు తెలిపింది.ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ కు చెందిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.మార్చి 17న ఇంగ్లీష్, మార్చి 20న గణితం పేపర్ -1ఏ , బోటనీపేపర్ -1, సివిక్స్ పేపర్ -1, మార్చి 23న గణితం పేపర్-1బీ, జువాలజీ పేపర్-1,హిస్టరీ-1,మార్చి 25న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1, మార్చి 28న కెమిస్ట్రీ పేపర్-1,కామర్స్ పేపర్-1,సోషియాలజీ పేపర్ -1, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ -1,మార్చి 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, ఏప్రిల్ 3న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియాగ్రఫీ పేపర్ -1 పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 16న ఇంటర్ సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 18న ఇంగ్లీష్ పేపర్ -2 , మార్చి 21న గణితం పేపర్ -2 ఏ, బొటనీ పేపర్ -2, సివిక్స్ పేపర్ -2, మార్చి 24న గణితం పేపర్ -2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2, మార్చి 27న ఫిజిక్స్ పేపర్ -2,ఎకనామిక్స్ పేపర్ -2 , మార్చి 29న కెమిస్ట్రీ-2, కామర్స్ పేపర్ -2,సోషియాలజీ పేపర్ -2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2, ఏప్రిల్ 1న పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్ -2, ఏప్రిల్ 4న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియాగ్రఫీ పేపర్ -2 పరీక్షలు నిర్వహించనున్నారువచ్చే ఏడాది ఫిబ్రవరి 22న ఎథిక్స్ , ఫిబ్రవరి 24న హుమన్ వాల్యూస్ పరీక్షలను ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు నిర్వహిస్తారు. ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఏప్రిల్ 15 నుండి 25వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.