Asianet News Telugu

నువ్వు రమ్మన్న చోటకే నేనొస్తా, తేల్చుకుందామా..?: జగన్ కు కోడెల సవాల్

ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. అవినీతిపై ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదా అవినీతిపై మాట్లాడేందుకు నువ్వు రమ్మన్న చోటకు నేనొస్తా అంటూ కోడెల సవాల్ విసిరారు. నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదామంటూ వ్యాఖ్యానించారు. 
 
ap speaker kodela sivaprasad rao comments on ys jagan
Author
Guntur, First Published Feb 4, 2019, 7:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన కోడెల జగన్ ఒక దుర్మార్గుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఒక దుర్మార్గుడు పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తాను అవినీతి చేశానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. అవినీతిపై ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదా అవినీతిపై మాట్లాడేందుకు నువ్వు రమ్మన్న చోటకు నేనొస్తా అంటూ కోడెల సవాల్ విసిరారు. నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదామంటూ వ్యాఖ్యానించారు. 

నేను ఎవరికీ తలవంచకుండా నిప్పులా బతికానని చెప్పుకొచ్చారు. విశ్వాసంతో పదవులు వచ్చాయని అంతే కానీ ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. తన రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని నీలా కాదు అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. తప్పు చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios