ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలకు రంగులు: ఆదేశాలను వెనక్కి తీసుకొన్న ఎస్ఈసీ
రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.
అమరావతి: రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.
ఎస్ఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం తాను ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకొంది. దీంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు.ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేసే వాహనాలకు ఉన్న రంగులను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశాలు ఇచ్చింది.
రంగులు మార్చకపోతే ఈ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ సివిల్ సప్లయిస్ శాఖను ఆదేశించింది. ఈ విషయమై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే ఎన్నికలు లేని ప్రాంతంలో ఈ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయవచ్చని గతంలో కోర్టు ఆదేశించింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరింది. ఈ విషయాన్ని కోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తమ ఆదేశాలను ఉపసంహరించుకొంటామని ఎస్ఈసీ ప్రకటించింది. దీంతో ఈ పిటిషన్ ను కోర్టు మంగళవారం నాడు డిస్పోజ్ చేసింది.