ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టు డివిజన్ బెంచీని ఆశ్రయించనున్న ఎస్ఈసీ


రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  ఎన్నికల సంఘం తలపెట్టిన విషయం తెలిసిందే.

AP SEC plans to file petition in division bench of High court over local body elections lns

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  ఎన్నికల సంఘం తలపెట్టిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.ఈ షెడ్యూల్ విడుదల చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది.

also read:నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ సస్పెండ్

కరోనా వ్యాక్సినేషన్  ప్రక్రియకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ విఘాతం కల్గిస్తోందని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం నాడు హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కరోనా వ్యాక్సినేషన్  ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ను  హైకోర్టు సస్పెండ్ చేసింది.

అయితే ఈ విషయమై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా ప్రస్తావించనుంది.

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన విషయాన్న ప్రస్తావించనుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని కూడ ఎస్ఈసీ ఈ సందర్భంగా వాదించే అవకాశం లేకపోలే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios