అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు మరో లేఖ రాశాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆ లేఖలో కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహలు చేస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆ లేఖలో  సీఎస్ ను కోరాడు. 

also read:పట్టు వీడని నిమ్మగడ్డ రమేష్ కుమార్: స్థానిక పోరుపై నీలం సాహ్నీకి మరో లేఖ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఆదేశాలను ఈ లేఖలో రమేష్ కుమార్ ప్రస్తావించారు.2021 ఓటర్ల సవరణ ప్రక్రియన జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదు. గతంలో ఇదే విషయాన్ని ఎస్ఈసీకి తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వీడియో కాన్ఫరెన్స్ కు  ప్రయత్నిస్తే  రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించలేదు. ఈ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అంతేకాదు  హైకోర్టుకు కూడ ఈ విషయాలను తెలిపింది.