ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయన్న ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చింది ఎస్ఈసీ. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది ఎస్ఈసీ.

ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయన్న ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చింది ఎస్ఈసీ. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది ఎస్ఈసీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

వచ్చే నెల రెండో తేదీ లోగా ఫిర్యాదులను కమీషన్‌కు పంపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అభ్యర్ధిత్వాల పునరుద్దరణలపై నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటి సంఘటనలు జరిగితే అభ్యర్ధిత్వాలను పునరుద్ధరించే అధికారం ఎస్ఈసీకి వుందంటున్నారు నిమ్మగడ్డ. 

అంతకుముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పుంగనూరు, మాచర్లలో ఏకగ్రీవాలపై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

అరగంట పాటు ఈ సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది. మూడో విడతలో13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా... ఫిబ్రవరి 17న 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. సర్పంచ్ పదవులకు బరిలో 7756 మంది నిలిచారు.