Asianet News TeluguAsianet News Telugu

వద్దంటున్న సర్కార్.. పట్టించుకోని నిమ్మగడ్డ: ‘ స్థానిక ’ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నాలుగు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు

ap sec nimmagadda ramesh kumar released local body election schedule ksp
Author
Amaravathi, First Published Jan 8, 2021, 10:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నాలుగు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు.

ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. 


తొలి దశ  

  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 23 
  • నామినేషన్ల స్వీకరణ- జనవరి 25 
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27 
  • నామినేషన్ల పరిశీలన- జనవరి 28  
  • నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31  
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)  

రెండో దశ   

  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 27 
  • నామినేషన్ల స్వీకరణ- జనవరి 29 
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31 
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1  
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4  
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)  

మూడో దశ   

  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 31 
  • నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2 
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4 
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5  
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8  
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)  

నాలుగో దశ   

  • నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 4 
  • నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6 
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8 
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9  
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12  
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 17 (ఓట్ల లెక్కింపు అదే రోజు)  
Follow Us:
Download App:
  • android
  • ios