అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి  ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు గాను ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఈ షెడ్యూల్ ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని భావించిన ఏపీ హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది.

హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో  ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం  సోమవారం నాడు సవాల్ చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

also read:చంద్రబాబు బూట్లు నాకుతూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే యత్నం: నిమ్మగడ్డపై కొడాలి ఫైర్

సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దమని పిటిషన్ లో ఎస్ఈసీ అభిప్రాయపడింది. అత్యవసర పిటిషన్ గా భావించి ఈ పిటిషన్ ను విచారించాలని ఎస్ఈసీ లాయర్ హైకోర్టును కోరారు.

ఈ పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేసే అవకాశం లేకపోలేదు.