Asianet News TeluguAsianet News Telugu

పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్: ఓట్ల లెక్కింపుపై ఎస్ఈసీ నీలం సాహ్ని కసరత్తు

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓట్ల  లెక్కింపు రాష్ట్ర ఎన్నికల కమీషన్ దృష్టి సారించింది. ఈ దిశగా ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ తేదీల ఖరారుపై శుక్రవారం అధికారులతో నీలం సాహ్ని భేటీకానున్నారు. 
 

ap sec neelam sahni focus on parishad elections counting
Author
Amaravati, First Published Sep 16, 2021, 2:44 PM IST

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓట్ల  లెక్కింపు లైన్ క్లియర్ అయ్యింది. ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించొచ్చని హైకోర్టు తెలిపింది. మే 21న ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును తోసిపుచ్చింది డివిజన్ బెంచ్. దీంతో ఎన్నికల కమీషన్ కౌంటింగ్ తేదీని ప్రకటించనుంది. ఈ దిశగా ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ తేదీల ఖరారుపై శుక్రవారం అధికారులతో నీలం సాహ్ని భేటీకానున్నారు. 

ALso Read:నీలం సాహ్నికి ఊరట: ఎపి పరిషత్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏప్రిల్ 8న రాష్ట్రంలో ఎంపీటీసీ , జడ్‌పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్ తేదీకి  నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్... ఆ ఎన్నికలు రద్దు చేసింది. నిబంధనలకు అనుగుణంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆగస్టు 5న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిని డివిజన్ బెంచ్... తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఓట్ల లెక్కింపుకు అనుమతిస్తూ తీర్పును వెలువరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios