Asianet News TeluguAsianet News Telugu

నీలం సాహ్నికి ఊరట: ఎపి పరిషత్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు ధర్మాసనం గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

Andhra pradesh high court green signals to MPTC and ZPTC counting
Author
Guntur, First Published Sep 16, 2021, 11:02 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు ధర్మాసనం గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  గతంలో ఏపీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును  హైకోర్టు ధర్మాసనం  తోసిపుచ్చింది. దీంతో కౌంటింగ్  తేదీని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

&n

sp;

 

 

సింగిల్ జడ్జి తీర్పును డివిజన్  ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ, కమిషనర్‌ నీలం సహానీ, ఎన్నికల్లో పోటీచేసిన మరికొందరు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగియడంతో ఆగస్టు 5న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ తీర్పును ఇవాళ ఇవ్వనున్నారు.

ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ ఏడాది మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్‌ డేట్‌కి నాలుగు వారాలకు ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉంది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణలో ఎస్‌ఈసీ అప్పీల్‌పై నిర్ణయాన్ని వెల్లడించేంతవరకు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ అప్పీల్‌ మరోసారి విచారణకు రాగా తీర్పు రిజర్వ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios