Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు బూట్లు నాకుతూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే యత్నం: నిమ్మగడ్డపై కొడాలి ఫైర్

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.

AP minister Kodali Nani serious comments on nimmagadda Ramesh kumar lns
Author
Guntur, First Published Jan 11, 2021, 6:28 PM IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.

సోమవారం నాడు ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు బూట్లు నాకుతూ కులం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

నిమ్మగడ్డకు కోర్టులు బుద్ది చెప్పాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.ఎన్నికల షెడ్యూల్ ను కోర్టు కొట్టివేయడాన్ని కొడాలి నాని స్వాగతించారు. హైకోర్టు నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

also read:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టు డివిజన్ బెంచీని ఆశ్రయించనున్న ఎస్ఈసీ

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజు సుదినంగా ఆయన పేర్కొన్నారు.తప్పుడు నిర్ణయాలు తీసుకొంటే ప్రజలే వెంటపడి కొడతారని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేందుకు పార్క్ హయత్‌లోనే నిమ్మగడ్డకు ట్రైనింగ్ ఇచ్చారన్నారు. 

హైకోర్టు తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైరైన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీలో చేరుతారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.చంద్రబాబునాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే శకునిని ప్రయోగించినా కోర్టులు బుద్దిచెప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios