విజయవాడ: ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన విజయవాడలో  12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు.

ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా  భవన నిర్మాణ కార్మికులు ఇటీవల కాలంలో  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇసుక కొరతతోనే పనులు లేక భవన నిర్మాణ కార్మికులు మృతి చెందుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

also read:సొంతపుత్రుడితో డైట్ దీక్ష....దత్తపుత్రుడితో రాంగ్ మార్చ్...: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ  ఈ నెల 3వ తేదీన విశాఖపట్టణంలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కూడ నిర్వహించారు. ఈ లాంగ్ మార్చ్‌లో  టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కూడ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఈ నెల 14వ తేదీన 12 గంటలపాటు దీక్ష చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు మంగళవారం నాడు గుంటూరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబునాయుడు చర్చించారు. 

ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ పనులు కూడ నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత నెల 30వ తేదీన 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదటు లోకేష్ దీక్ష చేశారు.ఈ దీక్షలో భవన నిర్మాణ కార్మికులతోపాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ఇసుక కొరతను నిరసిస్తూ చంద్రబాబునాయుడు  కూడ దీక్ష చేపట్టనున్నారు. 12 గంటల పాటు చంద్రబాబునాయుడు ఈ దీక్ష నిర్వహిస్తారు. ఇసుక కొరతపై ఏపీలో విపక్షాలు విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని కూడ నిర్ణయం తీసుకొంది.

అయితే ఇసుక కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు గాను చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇతర రాష్ట్రాల్లో లేిని ఇసుక కొరత ఎందుకు ఏపీ ఒక్క రాష్ట్రంలోనే ఉందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇసుక కొరత సమస్యను తీసుకొని విపక్షాలు పలు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి.