Asianet News TeluguAsianet News Telugu

Corona Cases in AP: ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం.. తాజాగా 5 వేల‌కు చేరువ‌లో కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆందోళనకర రీతిలో కేసులు పెరుగుతున్నాయి. నిన్న 4వేల 528 కేసులు నమోదవగా నేడు 4,955  కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. 
 

Ap Reports 4955 New Corona Cases In Last 24 Hours
Author
Hyderabad, First Published Jan 15, 2022, 6:00 PM IST

Corona Cases in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య ఆందోళ‌న క‌లిగించే ఉంది. నిన్న 4,528 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధార‌ణ కాగా.. నేడు ఆ సంఖ్య 5 వేలకు  చేరువ‌లోకి వెళ్లింది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673  కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4,955 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in AP) గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 21,01,710 కి చేరాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. వైరస్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో  ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,509 కి చేరింది.  

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 397 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22వేల 870కి పెరిగిందని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,331మంది బాధితులు కోలుకున్నారు.అత్యధికంగా విశాఖలో వెలుగుచూశాయి. విశాఖపట్నం జిల్లాలో 1103 కేసులు న‌మోదు కాగా..  చిత్తూరు జిల్లాలో 1039 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. నేటి వరకు రాష్ట్రంలో 3,18,32,010 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 21,01,710కి పెరిగింది.  

అనంత‌ర‌పూర్ లో  212, తూర్పుగోదావరిలో 303, శ్రీకాకుళంలో 243, గుంటూరు జిల్లాల్లో 326, క‌డ‌ప‌లో 377 కేసులు. కృష్ణ‌లో 203 కేసులు, క‌ర్నులులో 323 కేసులు, నెల్లూర్‌లో397 కేసులు,  విజ‌య‌నగ‌రంలో 184కేసులు, వెస్ట్ గోదావ‌రిలో 55 కేసులు న‌మోద‌య్యాయి. ఇలా క‌రోనా విజృంభిస్తుండ‌టంలో  ఈ నెల 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. 


అలాగే దేశంలో  కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క్ర‌మంగా రోజువారి కేసుల సంఖ్య‌ పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 2,68,833 కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో  1,22,684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14 లక్ష17 వేల 820 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతానికి చేరింది. అదే స‌మయంలో కోవిడ్‌తో 402 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.85 లక్షల చేరింది. మహారాష్ట్రలో క‌రోనా విజృంభిస్తోంది. అత్య‌ధికంగా 43 వేల 211 కేసులు నమోదు అయ్యాయి.ఆ త‌రువాత‌.. కర్ణాటకలో 28,723 కేసులు. ఢిల్లీలో 24,383 కేసులు, తమిళనాడులో 23,459 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 22,645 కేసులు నిర్ధారణ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, కేరళల్లో 16 వేలకు పైగా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అలాగే.. రాజస్థాన్‌లో కొత్తగా 10,307 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios