Asianet News TeluguAsianet News Telugu

అమరావతి స్కామ్‌లో ట్విస్ట్: సీజేఐకి జగన్ లేఖ.. అజేయ కల్లం కీలక ప్రకటన

అమరావతి కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ కుమార్తెల పాత్రపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. 

ap principal advisor ajeya kallam press meet
Author
Vijayawada, First Published Oct 10, 2020, 10:09 PM IST

అమరావతి కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ కుమార్తెల పాత్రపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు.

టిడిపి కి అనుకూలంగా హైకోర్టు ఇస్తున్న తీర్పుల కాపీలను ప్రభుత్వం ఈ లేఖకు జత చేసింది. మాజీ ఏజీ దమ్మలపాటి కేసు లో మీడియా కవరేజ్ లేకుండా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

టిడిపి అధినేత చంద్రబాబు తో దమ్మలపాటికి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు వచ్చాయని ప్రభుత్వం లేఖలో ఆరోపించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక వివిధ చానళ్లలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు.

శనివారం రాత్రి విజయవాడలో కీలక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios