టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీ తయారీ ప్లాంట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీ తయారీ ప్లాంట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అమరరాజాకు చెందిన నాలుగు యూనిట్లకు పవర్ సప్లయ్ నిలిపివేయాలని ఎస్‌పీడీసీలకు నాలుగు లేఖలు రాసింది. నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమ నిర్వహణ జరగడం లేదని తేల్చింది పీసీబీ. ఏ ఇతర పద్ధతుల్లోనూ పరిశ్రమ నడపకూడదని ఆదేశించింది.

పరిశ్రమ కారణంగా తీవ్ర కాలుష్యం వెలువడుతోందని గుర్తించింది పీసీబీ. పొల్యూషన్‌ని నియంత్రించేందుకు యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదని పీసీబీ ఆరోపించింది. అలాగే ఆయా ప్లాంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, ఉద్యోగుల రక్తంలో కూడా లెడ్ అవశేషాలు వున్నట్లు గుర్తించింది. 

Also Read:గల్లా జయదేవ్‌కు జగన్ సర్కార్ షాక్... ‘‘అమరరాజా’’ మూసివేతకు ఆదేశం

కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రలను వివిధ కేసుల్లో జైలుకు పంపింది. తాజాగా మరో కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌‌కి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. 

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రలను వివిధ కేసుల్లో జైలుకు పంపింది.

తాజాగా మరో కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌‌కి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనే అభియోగంపై చిత్తూరు జిల్లాలో వున్న అమరరాజా కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సమీక్షించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ‘అమర రాజా బ్యాటరీస్‌’ స్పష్టం చేసింది.