AP politics Roundup 2021: టీడీపీ నేతలపై కేసులు, జైలు బాట పట్టిన కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. కొందరు కీలక నేతలు జైలు బాట పట్టారు. అక్రమ కేసులపై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడిషీయల్ విచారణ చేపడుతామని చంద్రబాబు హెచ్చరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Ycp ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత Tdpకి చెందిన కీలక నేతలపై పలు కేసు నమోదయ్యాయి. అంతేకాదు కొందరు టీడీపీ నేతలు జైలుకు కూడా వెళ్లారు. మరికొందరు నేతలు అరెస్ట్ కాకుండా కోర్టు నుండి ముందస్తు బెయిళ్లు పొందారు. టీడీపీ శాసనసభపక్షఉప నాయకుడు Atchannaidu జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అరెస్టయ్యారు. గత ఏడాది Esi స్కాంలో అచ్చెన్నాయుడిని జగన్ సర్కార్ అరెస్ట్ చేసింది. అయితే ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే 12న అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ సందర్భంగా నిమ్మాడలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని బెదిరించారనే కేసులో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అచ్చెన్నాయుడి అరెస్ట్ జరిగిన కొన్ని రోజులకే మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు పోలీసులు. మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి Kollu Ravindra ప్రమేయం ఉందని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర అరెస్టై జైలు జీవితం గడిపి వచ్చారు. ఏపీ సీఎం Ys Jagan పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి Ayyanna patruduపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ చేయవద్దని కోరుతూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గత ఏడాది నకిలీ పత్రాలతో బీఎస్ 3 వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది పెద్దారెడ్డిపై మీసం మేలేసీ సవాల్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ చివర్లో JC Prabhakar Reddy ఇంటిపై పెద్దారెడ్డి దాడికి దిగాడు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై 72 కేసులు నమోదయ్యాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
also read:తిరుపతిలో అమరావతి రైతుల సభ... టిడిపి శ్రేణులు సహకరించండి: అచ్చెన్నాయుడు పిలుపు
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో టీడీపీ నేత Kuna Ravi పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. అధికారులను దూషించారని, ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిపై దాడికి దిగారని కూన రవికుమార్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రవి కుమార్ అరెస్టయ్యాడు. గతంలో కూడా ఆయన అరెస్టయ్యారు ఈ ఏడాది కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి Devineni Uma Maheswara Rao కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూలై 29న దేవినేని ఉమాను అరెస్ట్ చేశారు. కొండపల్లి మండలంలో అక్రమ మైనింగ్ వ్యవహరంపై నమోదైన కేసు సందర్భంగా దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకొన్నాయనే నెపంతో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే Dhulipalla narendra kumar అరెస్ట్ చేశారు. Sangam డెయిరీపై కేసులు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా ప్రత్యర్ధులను బెదిరించారని మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు Paritala Sriram పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
also read:AP politics Roundup 2021: పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్’తో మొదలు.. మాటల తూటాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiపై కేసు నమోదైంది. ఈ ఘటనను నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న సీఐ నాయక్ పై దాడికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.కర్నూల్ జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి వైసీపీ నేతపై హత్యాయత్నం చేశారనే కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే 24న బీసీ జనార్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా నిర్వహించిన ఆందోళనకు సంబంధించి కాలువ శ్రీనివాసులుపై కేసు నమోదైంది.గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. మరో మాజీ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులుపై కూడా పలు కేసులు నమోదయ్యాయి.
అెక్రమ కేసులపై జ్యుడిషీయల్ విచారణ
తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ సర్కార్ అక్రమంగా కేసులు బనాయిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కేసులు బనాయిస్తూ తమ పార్టీ క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతినేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులపై జ్యూడిషీయల్ విచారణ చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు. అక్రమంగా కేసులు బనాయించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ కేసులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయాలని కూడా Chandrababu Naidu పార్టీ నేతలకు సూచించారు.
కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టుగా కేసులు బనాయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏ ఏ జిల్లాల్లో ఏ పోలీస్ అధికారి ఎలా వ్యవహరిస్తున్నారోననే విషయమై లెక్కలు రాసి పెడుతున్నామని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. తాము అదికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని లోకేష్ కూడా ప్రకటించారు. చట్ట ప్రకారంగా వ్యవహరించాల్సిన పోలీసులు చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీడీపీకి చెందిన నేతలు కేసులకు భయపడి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.అయితే గతంలో చేసిన పొరపాట్లు ఇక భవిష్యత్తులో చేయబోనని చంద్రబాబు ప్రకటించారు.
పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వారికే రానున్న రోజుల్లో పార్టీలో పదవులు కట్టబెడతానని చెప్పారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని రాసి పెడుతున్నానని ఇటీవల పార్టీ సమీక్షలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడం, పార్టీ క్యాడర్ ను పట్టించుకోకపోవడం కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు తెగేసి చెప్పారు. భవిష్యత్తులో ఇలా జరగదని చంద్రబాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.