అమరావతి:ఏపీ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీర హై అలర్ట్ విధించారు.

దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. గుజరాత్ తీర ప్రాంతంలో ఇటీవల కాలంలో రెండు బోట్లు అనుమానాస్పదస్థితిలో కన్పించాయి. దీంతో నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.

ఏపీ తీర ప్రాంతంలో కూడ పోలీసులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంలో మత్స్యకారులను కూడ పోలీసులు సమాచారం ఇచ్చారు. కొత్త వ్యక్తులు తీర ప్రాంతంలో కన్పిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.