కార్తి నటించిన ‘ఖాకీ’ సినిమా చూశారా. అందులో దోపిడీలు, హత్యలు చేసే ముఠా సభ్యులను పట్టుకునేందుకు కార్తి అండ్ టీమ్ రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి వెళ్తారు. అక్కడి గ్రామస్థులు నిందితులకు మద్దతుగా నిలిచి పోలీసులపైనే దాడికి పాల్పడతారు.

దొరికిన వారిని విచక్షణా రహితంగా కొట్టి ఊరి నుంచి తరిమేస్తారు. అచ్చుగుద్ది నట్లు ఆ సినిమా తరహాలోనే రాజస్థాన్‌లోనే గ్రామస్తుల ప్రతిఘటన ఎదుర్కొన్నారు ఏపీ పోలీసులు.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి పోలీసుల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచాడు. దీనిపై దర్యాప్తు జరిపిన ప్రకాశం జిల్లా పోలీసులు ఇది రాజస్థాన్‌లోని నగ్లాకుందన్‌కు చెందిన వ్యక్తి పని తేల్చారు.

దీంతో నిందితుడిని పట్టుకునేందుకు గాను నలుగురు పోలీసులు రాజస్థాన్ వెళ్లారు. అక్కడి స్థానిక పోలీసులతో కలిసి నిందితుడున్న గ్రామానికి వెళ్లగా పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఊహించని ఈ పరిణామానికి షాక్‌కు గురైన పోలీసులు.. వెంటనే తేరుకుని లాఠీఛార్జీ చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.