అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ బాండ్లను సేకరణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఏపీ  ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మెన్  కుటుంబరావు  తప్పుబట్టారు.

సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సీఆర్‌డీఏ బాండ్ల సేకరణపై  వస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు.  జీహెచ్‌ఎంసీ, ఏపీ రాజధాని బాండ్ల సేకరణకు పోలికే లేదన్నారు. 

సీఆర్‌డీఏలో ఒక్క గజం భూమిని కూడ  తాకట్టు పెట్లలేదన్నారు. ఈ విషయమై కనీసం సమాచారం లేకుండానే కొందరు  విమర్శలు  చేస్తున్నారని కుటుంబరావు అభిప్రాయపడ్డారు. 

ప్రపంచబ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.  ఏదైనా విమర్శలు చేసే ముందు ఆలోచించాలని ఆయన సూచించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ బాండ్లను సేకరణ కోసం ఇటీవల ప్రయత్నించింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు సీఆర్‌డీఎ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వార్త చదవండి

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో అమరావతి బాండ్లకు భారీ గిరాకీ