జీవీఎల్‌కు కౌంటర్: బిజెపికి 150 ఎంపీ సీట్లే, ఆధారాలు బయటపెట్టాలి: కుటుంబరావు

Ap plannig deputuy chairman kutumbha rao reacts on GVL   Narasimha Rao comments
Highlights

జీవీఎల్ కు కుటుంబరావు కౌంటర్

అమరావతి:  అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమైతే ప్రభుత్వంపై కేసులు దాఖలు చేయవచ్చని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుకు ఏపీ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మెన్ కుటుంబరావు చెప్పారు.
బుధవారం నాడు ఆయ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.తాను నిన్న చేసిన విమర్శలకు బిజెపి అధికార ప్రతినిధి నరసింహారావు నుండి  సరైన సమాధానాలు లేవన్నారు.

అగ్రిగోల్డ్  ఆస్తుల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవాలన్నీ తేలితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టులో పిటిషన్  దాఖలు చేయాలని బిజెపి నేతలకు  ఏపీరాష్ట్ర ప్లానింగ్ డిప్యూటీ చైర్మెన్  కుటుంబరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం అభివృద్ది చేసిందనే విషయమై క్షేత్రస్థాయికి వెళ్ళి చూస్తే అర్ధం అవుతోందన్నారు. 2 జీ కేసు కు సంబంధించిన ఎలా నీరు గార్చారో తమకు తెలుసుననని ఆయన చెప్పారు.


అసత్యాలతో  రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో  బాధితులకు న్యాయం జరగకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆయన విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన యూసీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు కూర్చొంటే అసలు విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

కానీ, తన మాటలకు సరైన సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా జీవీఎల్ మాట్లాడారని ఆయన చెప్పారు. నిన్న ప్రెస్ మీట్ లో బిజెపి నేతలకు సంబంధించిన సమాచారం తమ వద్దని ఉందని చెప్పగానే ఆ పార్టీ నేతలకు భయం పట్టుకొందన్నారు.అందుకే ఈ విషయమై ఆ పార్టీ నేతలు ఉదయాన్ని ప్రెస్ మీట్ పెట్టారన్నారు.  అబద్దాలు చెప్పడంలో జీవీఎల్ దిట్ట అని తేలిపోయిందన్నారు. 2జీ కేసును ఏ రకంగా నీరుగార్చారనే విషయమై ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. 2జీ కేసును బిజెపి నేతలు నీరుగార్చారని ఆయన ఆరోపించారు.

వివిధ రంగాల్లో నైపుణ్యం గలవారిని ప్లానింగ్ బోర్డులో తీసుకొంటారని ఆయన చెప్పారు. షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉందని తనకు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా పదవిని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

బిజెపి నేతలతో పాటు ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నామని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు కమ్యూనికేషన్లు  కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం హైద్రాబాద్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసును పెట్టిన  విషయాన్ని ఆయన గర్తు చేశారు.


 
 

  

loader