Asianet News TeluguAsianet News Telugu

ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు: దూసుకుపోతున్న జగన్ పార్టీ, చంద్రబాబుకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ దూసుకుపోతోంది. చంద్రబాబు నాయుత్వంలోని టీడీపీ మూడు జిల్లాల్లో మాత్రమే రెండంకెల సీట్లను సాధించింది. 

AP Parishadh elections: YCP sweeps, TDP of Chandrababu trails
Author
Amaravati, First Published Sep 19, 2021, 10:31 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దూసుుకుపోతోంది. జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటుతోంది. ఆదివారం ఉదయం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల సమయానికి అందిన ఫలితాల ప్రకారం... వైసీపీ చాలా జిల్లాల్లో వైసీపీ సాధించిన ఎంపీటీసీ సీట్ల సంఖ్య మూడంకెలు చేరుకోగా, చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ రెండంకెల స్థానాలను సాధించుకోవడానికి అపసోపాలు పడుతోంది. 

పరిషత్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీకి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు టీడీపీ ఒక్మ జడ్పీటీసీ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. వైసీపీ మాత్రం దూసుకుపోతోది. కృష్ణా జిల్లాలో టీడీపీ ఇప్పటి వరకు ఒక్క ఎంపీటీసీ సీటు కూడా రాలేదు. టీడీపీకి కంచుకోటగా భావించే గుంటూరు జిల్లాలో కూడా టీడీపీ నామమాత్రం ప్రభావాన్నే చూపుతోంది. వైసీపీ 213 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకోగా, టీడీపీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. 

ప్రకాశం జిల్లాలో టీడీపీ కాస్తా తన ఉనికిని చాటుకుంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ 316 సీట్లు రాగా, టీడీపీ 33 స్థానాలు దక్కాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ 180సీట్లు రాగా, టీడీపీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి 19 స్థానాలు మాత్రమే దక్కాయి. వైసీపీకి 382 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ప్రతిపక్షాల జాడ కనిపించడం  లేదు. టీడీపీకి ఒక్క ఎంపీటీసీ సీటు కూడా ఇప్పటి వరకు రాలేదు. వైసీపీ 440 ఎంపీటీస స్థానాలను 38 జడ్పీటీసి స్థానాలను దక్కించుకుంది. 

అనంతపురం జిల్లాలో టీడీపీ తన బలాన్ని పూర్తిగా కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఇప్పటి వరకు 1 ఎంపీటీసీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. వైసీపీకి 51 స్థానాలు లభించాయి. కర్నూలు జిల్లాలో మాత్రం టీడీపీ తన ఉనికిని చాటుకుంది. టీడీపీకి 44 ఎంపీటీసీ సీట్లు రాగా, వైసీపీకి 277 సీట్లు వచ్చాయి. 

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తన ఖాతా తెరవలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు ప్రయత్నాలేవీ ఫలించలేదు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి 1 ఎంపీటీసీ సీటు మాత్రమే వచ్చింది. వైసీపీ 77 ఎంపీటీసీ సీట్లను సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు వైసీపీకి 65 స్థానాలు దక్కగా,  టీడీపీకి 3 స్థానాలు దక్కాయి. 

కృష్ణా జిల్లాలో టీడీపీకి దేవినేని ఉమామహేశ్వర రావు వంటి పలువురు సీనియర్ నేతలున్నారు. కేశినేని విజయవాడ ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. వైసీపీ మాత్రం ఇప్పటి వరక 70 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఖాతా తెరిచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. ఈ లెక్కింపులో పవన్ కల్యాణ్ జనసేన కొన్ని ఎంపీటీసీ సీట్లను కైవసం చేసుకుంది. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఫలితాల్లో దూసుకుపోతోంది. ఆయన సొంత జిల్లా కడపలో ప్రతిపక్షాలు ఏ మాత్రం సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు టీడీపీకి గానీ, ఇతర ప్రతిపక్షాలకు గానీ కడప జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. 

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం 33 ఎంపీటీసీ సీట్లు సాధించింది. కాగా, బిజెపి కూడా ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. కర్నూలు జిల్లాలో బిజెపి 2 ఎంపీసీ సీట్లు గెలుచుకుంది. 

ఇదిలావుంటే, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఉదయం 10 గంటల సమయం వరకు ఏడు ఎంపీటీసీ సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండేసీ ఎంపీటీసీ సీట్లను జనసేన గెలుచుకుంది. గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కటేసి ఎంపీటీసీ సీట్లను జనసేన గెలుచుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios