పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల విధుల విషయం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమరావతి జేఏసీ ఎస్ఈసీని కోరింది. ఈ వినతిని పరిగణలోకి తీసుకున్న ఎస్ఈసీ గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక జబ్బుల(క్యాన్సర్, గుండె, కిడ్నీ)తో బాధపడుతున్న వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇచ్చింది.
read more పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఆదేశాలు: ఏపీ హైకోర్టుకెక్కిన జగన్ సర్కార్
ఇదిలావుంటే పంచాయితీ ఎన్నికల విదులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఇప్పటికే ఎస్ఈసి నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ తర్వాతి స్థానంలో సంక్షేమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
