Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఈసీ కాల్ సెంటర్ కు 196 ఫిర్యాదులు...ఆ జిల్లా నుండే అత్యధికం

తొలిరోజు 13 జిల్లాల నుంచి 196 ఫిర్యాదులు ఎస్ఈసీ కాల్ సెంటర్ కు వచ్చాయని నిమ్మగడ్డ తెలిపారు. 

ap panchayat election...  196 complaints in SEC call center
Author
Amaravathi, First Published Feb 12, 2021, 9:26 AM IST

విజయవాడ: స్థానిక సంస్థలకు సంభందించిన ఫిర్యాదులను రియల్ టైం విధానంలో ఎస్ఈసి కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం, చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గురువారం నుంచి కార్యకలాపాలను పర్యవేక్షించడం ప్రారంభించామన్నారు. 

తొలిరోజు 13 జిల్లాల నుంచి 196 ఫిర్యాదులు కాల్ సెంటర్ కు వచ్చాయని నిమ్మగడ్డ తెలిపారు. వాటిపై చర్యలు తీసుకోవాలని సంబందించిన జిల్లా కలెక్టర్లకు, సిపి , ఎస్పీ , ఆర్వోలకు ఆదేశాలను జారీచేశామన్నారు. రాష్ట్ర ఎస్ఈసి కేంద్రం నుండి ఈ ప్రక్రియను కార్యదర్శి కె .కన్నబాబు, అడిషనల్ డిజిటి సంజయ్ లు వ్యక్తిగతంగా పర్యవేక్షించడం జరుగుతోందని రమేష్ కుమార్ తెలిపారు.

read more  నిమ్మగడ్డతో సీఎస్, డిజిపి భేటీ... సమావేశంలో విరబూసిన నవ్వులు

ఇప్పటివరకు జిల్లాల వారీగా అందిన ఫిర్యాదుల వివరాలను ఎస్ఈసి వెల్లడించారు. శ్రీకాకుళం 5, విజయనగరం 6, విశాఖపట్నం  19, తూర్పు గోదావరి 29, పశ్చిమ గోదావరి 14, కృష్ణా  24, గుంటూరు 19, ప్రకాశం 16, ఎస్పిఎస్సార్ నెల్లూరు 6, కర్నూల్ 21, వైఎస్ఆర్ కడప 11, చిత్తూరు 23, అనంతపురం 3  ఫిర్యాదులు అందాయన్నారు.

మరింత సమర్ధవంతంగా కార్యకలాపాలను నిర్వహించే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, అభ్యర్థులు చిన్న చిన్న విషయాలపై కాకుండా తీవ్రమైన సమస్యలుంటేనే కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలని నిమ్మగడ్డ సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios