Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో జూలై 15 నుంచి ఆన్లైన్ క్లాసులు షురూ...

ఏపీలో తరగతుల ప్రారంభతేదీ మీద క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. 

ap online classes starts from july 15th onwards - bsb
Author
Hyderabad, First Published Jul 5, 2021, 10:46 AM IST

ఏపీలో తరగతుల ప్రారంభతేదీ మీద క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. 

దూరదర్శన్, రేడియో, విద్యా వారధి ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, స్కూళ్లకు విద్యార్థులు ఎప్పటి నుంచి రావాలనే దానిమీద ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఆదివారం కృష్ణాజిల్లా పెడనలో చినవీరభద్రుడు పర్యటించారు. స్థానిక రెండో వార్డులో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసిన స్కూల్ ని పరిశీలించారు. ఈ నెల ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతుూ బడుల పున:ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారని, విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ జరుగుతోందని కమిషనర్ చెప్పారు. 

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపింది. విద్యార్థులు స్కూళ్లకు వచ్చే పరిస్థితులు లేవు. ఇంకా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. విద్యా సంవత్సరం వృధా కాకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా పలు పరీక్షలు రద్దయ్యాయి.

ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ క్లాసుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. 

ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో 70 శాతం ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యలారిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సంవత్సరం ఫీజులు నిర్ణయిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దాని ప్రకారం ప్రైవేటు స్కూల్స్ లో ఫీజులు నిర్ణయిస్తామంది. కాగా, ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios