అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా ఆయనతో ాపటు ఉన్నారు. 

"

సీఎం వైయస్‌.జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని అదే రోజు పదవీ విరమణ చేస్తున్నారు.

నీలం సాహ్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. మధ్యలో ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడగించింది.