Asianet News TeluguAsianet News Telugu

గుండుగుత్తకు వైసీపీ ప్లాన్: మైదుకూరు, తాడిపత్రిల్లోనూ టీడీపీకి షాక్

అత్యధిక స్థానాలు గెలుచుకున్న మైదుకూరు, తాడిపత్రిల్లోనూ టీడీపీకి షాక్ ఇచ్చేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను కలిపినా బలాలు సమానవుతున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.

AP Municipal Elections: YCP plan to win Tadipatri and Mydukuru
Author
amaravati, First Published Mar 15, 2021, 9:59 AM IST

అమరావతి: మెజారిటీ వార్డుల్లో విజయం సాధించిన తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వ్యూహరచన చేసింది. దీంతో గుండుగుత్తగా ఆన్ని మున్సిపాలిటీల్లోనూ జెండా ఎగరేయడానికి ఉవ్విళ్లూరుతోంది. తాడిపత్రి, మైదుకూరుల్లో టీడీపీ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నప్పటికి  చైర్ పర్సన్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చైర్ పర్సన్ ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగనున్నాయి. మైదుకూరు, తాడిపత్రి మున్సిపాలిటీల చైర్ పర్సన్ పదవులను ఎక్స్ అఫిషియో సభ్యుల ద్వారా వైసీపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు 

మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. ఎక్స్ అఫిషియో సభ్యులను కలిపితే మొత్తం 26 ఓట్లు ఉంటాయి. ఇందులో 14 ఓట్లు వచ్చే పార్టీకి చైర్ పర్సన్ పదవి దక్కుతుంది. మైదుకూరులో 11 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ, ఒక్క చోట జనసేన విజయం సాధించాయి. వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దాంతో వైసీపీ బలం 13కు పెరిగింది. 

జనసేన మద్దతు ఇచ్చినప్పటికీ చైర్ పర్సన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం లేదు. జనసేన ఒక్క ఓటుతో కలిపి టీడీపీకి కూడా 13 ఓట్లే ఉంటాయి. ఇదే జరిగితే టాస్ వేయాల్సి వస్తుంది. అయితే, ఈలోగా వైసీపీ నేతలు చక్రం తిప్పి తమ బలాన్ి పెంచుకునే అవకాశాలు లేకపోలేదు.

తాడిపత్రి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. వీటిలో టీడీపీ 18 వార్జులను గెలుచుకుంది. వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. సిపిఐ ఒక చోట విజయం సాధించగా, మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాగా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్నారు. అనంతపురం ఎంపీ రంగయ్య ఇంకా ఎక్కడా తన పేరును నమోదు చేసుకోలేదు. 

మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్ -5 క్లాజ్ (3) ప్రాకరం పోలింగ్ తేదీ తర్వాత 30 రోజుల లోపు ఆనయ ఎక్కడో చోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. రంగయ్య తాడిపత్రిలో ఎక్స్ అఫిషిో సభ్యుడిగా పేరు నమోదు చేసుకుంటే వైసీపీ బలం కూడా 18కి పెరుగుతుంది. దీంతో టీడీపీ, వైసీపీ బలాలు సమానమవుతాయి. సిపిఐ అభ్యర్థి ఒక పార్టీకి, స్వతంత్ర అభ్యర్థి మరో పార్టీకి మద్దతు ఇచ్చినా బలాలు సమానవుతాయి. 

అయితే తాడిపత్రి చైర్మన్ పదవిని దక్కించుకోవడం వైసీపీకి అంత సులభం కాదని అర్థమవుతోంది. సిపిఐ కౌన్సిలర్ తో పాటు స్వతంత్ర కౌన్సిలర్ టీడీపీ క్యాంప్ రాజకీయంలో చేరారు. దీంతో టీడీపీ బలం 20కి పెరుగుతుంది. మరోవైపు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తన పేరు నమోదు చేసుకున్నారు. దీంతో టీడీపీ బలం 21 పెరిగింది. వైసీపీకి 18 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వైసీపీకి తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రహస్య ప్రాంతానికి తరలించారు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ఆయన ఎత్తులు వేస్తున్నారు. మొత్తం మీద, మైదుకూరు, తాడిపత్రి మున్సిపాలిటీల చైర్మన్ పదవుల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios