Asianet News TeluguAsianet News Telugu

AP Municipal Elections 2021 : నెల్లూరు క్లీన్ స్వీప్ దిశగా వైఎస్సార్ సీపీ...

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో అనేక డివిజన్లలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. కాగా ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 20 డివిజన్లలో వైఎస్సార్ సీపీ  విజయం సాధించి, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్స టీడీపీ ఖాతా తెరవకపోవడం విశేషం..   

AP Municipal Elections 2021 : nellore corporation election win YSRCP
Author
Hyderabad, First Published Nov 17, 2021, 2:47 PM IST

నెల్లూరు : నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 20 డివిజన్లలో వైఎస్సార్ సీపీ  విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్స టీడీపీ ఖాతా తెలరవలేదు. 

ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 15,14,19,27,28,33,36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది.  

ఇదిలా ఉండగా, TDP అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోటా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది.  కుప్పం  మున్సిపాలిటీ ని  వైసిపి కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైసీపీ అక్కడ జయకేతనం ఎగురవేసింది మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా 14 వ వార్డులో వైసిపి అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో మిగిలిన  24 స్థానాలకు పోలింగ్ జరిగింది.

అయితే పోలింగ్ సందర్భంగా వైసిపి టిడిపి మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండడంతో టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  అయితే చంద్రబాబు కంచు కోటలో జెండా ఎగురవేయాలని అధికార వైసిపి  భావించింది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టికుప్పం మున్సిపాలిటీ ఫలితం పైనే ఉంది.

ఇక kuppamలో పాగా వేసేందుకు ycp గత కొంతకాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. కుప్పంలో టీడీపీ కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లడం కూడా వైసీపీ గెలుపుకు కారణంగా మారింది. దీనికి తోడు చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014 నుంచి చూస్తున్నారు. 

దాచేపల్లి మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ మధ్య మధ్య పోటాపోటీ కొనసాగింది. అయితే చివరకు అధికార పార్టీ దాచేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 19 వార్డులు ఉండగా, అందులో ఒకటి వైసీపీ ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వాటిలో వైసీపీ 10 వార్డులు, టీడీపీ 7 వార్డులు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు. దీంతో వైసీపీ 11 స్థానాలతో అక్కడ విజయం సాధించింది.

Kuppam municipal election result: చంద్రబాబును పుంగనూరు‌లో పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నా.. మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని nellore కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో మాదిరిగానే ప్రతి చోట YSR Congress Party తన హవా కొనసాగిస్తోంది.  నెల్లూరు కార్పొరేషన్ ను క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే కుప్పంలోనూ పాగా వేసింది. 

దీని వెనుక వైసీపీ పక్కా వ్యూహం మంత్రి పెద్దిరెడ్డి చాణక్య వ్యూహం ఉన్నాయని తెలుస్తోంది. ఇక కొండపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచి కీలకంగా మారారు. ఆవిడ ఎవరికి మద్దతు పలికితే వారే కొండపల్లిలో పాగా వేసే అవకాశం ఉంది. అయితే విజయలక్ష్మి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగడంతో.. టీడీపీకే మొగ్గు చూపుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios