Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మరోసారి జోరుగా వీచిన ఫ్యాన్ గాలి... మున్సిపాలిటీ, కార్పోరేషన్లన్నీ వైసిపివే

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది.

AP Municipal Election live updates
Author
Amaravathi, First Published Mar 14, 2021, 7:00 AM IST

విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వశమయ్యింది. 98 డివిజన్లకు గాను  57డివిజన్లలో ప్యాన్ గాలి బలంగా వీచి అభ్యర్ధులు బంపర్ మెజారీటీతో గెలుపొందారు. దీంతో మరో కార్పోరేషన్ వైసిపి చేతిలోకి వెళ్లింది. టిడిపి 29, బిజెపి 1, జనసేన 4, ఇతరులు 5చోట్ల విజయం సాధించినట్లు తెలుస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో విజయడంకా మోగించిన వైసిపికి సీఎం సొంత జిల్లా కడపలోని మైదుకూరులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి అనూహ్యంగా టిడిపి 12వార్డులతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక అధికార  వైసిపి వైసిపి 11, జనసేన 1వార్డులో గెలుపొందింది. ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 కాగా జనసేన తరపున గెలిచిన అభ్యర్థి నిర్ణయం కీలకంగా మారింది. దీంతో తమ పార్టీల తరపున గెలిచిన వారిని ఇతరపార్టీలవైపు చూడకుండా వైసిపి, టిడిపి క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టింది. 

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మొత్తం 98 డివిజన్లకు గాను వైసీపీ 55, టీడీపీ 21, సీపీఐ, 1, సీపీఎం 1, జనసేన 3, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యతలో వున్నారు. 

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. 26 వార్డులో కేవలం ఐదు ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి గెలుపొందగా టిడిపి రీకౌంటింగ్ కు డిమాండ్ చేసింది. అయితే తమ డిమాండ్ ను అధికారులు పట్టించుకోవడం లేదని... ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని టిడిపి అభ్యర్థి పేర్కొన్నారు.  

గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు:

గుంటూరు కార్పోరేషన్ 57 / 57
           ---------------
1)వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:45
2) తెలుగుదేశం పార్టీ :8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:2
5) ఇతరులు:2

 

 మాచర్ల  31/31
    --------------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:31
2) తెలుగుదేశం పార్టీ:0
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0


     వినుకొండ 32/32
  ----------------------------

1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:28
2) తెలుగుదేశం పార్టీ:4
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

 రేపల్లె  27/28
-----------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:25
2) తెలుగుదేశం పార్టీ:2
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

 పిడుగురాళ్ల 33/33
-----------------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:33
2) తెలుగుదేశం పార్టీ:0
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

 సత్తెనపల్లి 31/31
  ---------------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:24
2) తెలుగుదేశం పార్టీ:4
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:1
5) ఇతరులు: 2


 తెనాలి 38/40
------------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:30
2) తెలుగుదేశం పార్టీ:8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0


చిలకలూరిపేట 38/38
-------------------------------
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:30
2) తెలుగుదేశం పార్టీ:8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0
5) ఇతరులు: 0

తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 36వార్డులకు గాను 19 చోట్ల టిడిపి విజయం సాధించి దాదాపు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా హవా కొనసాగిస్తున్న వైసిపి తాడిపత్రిలో కేవలం 11వార్డుల్లో గెలిచింది. 1వార్డులో సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. గెలుపొందిన టిడిపి అభ్యర్థులను అధికార వైసిపి ప్రలోబాలకు గురిచేసే అవకాశం వుందన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా వారిని తన నివాసానికి పిలిపించుకున్నారు జేసి ప్రభాకర్ రెడ్డి.  

 విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వైసిపి, టిడిపిల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన 15వార్డుల్లో టీడీపీ 8, వైసీపీ 7చోట్ల గెలుపొందారు. 

అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ లో 20 వార్డులకు గాను16 మంది వైసిపి అభ్యర్థులు గెలుపొందగా 06 మంది టిడిపి అభ్యర్థులు గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థుల వివరాలు...

1. తిప్పన్న (వైసీపీ) మెజారిటీ- 613

2. తుంగ ఓబుల్ బతి (వైసీపీ) మెజారిటీ- 54

3. వై సాయి లీల (టిడిపి) మెజారిటీ--142

4. చెరువు భాస్కర్ రెడ్డి (వైసీపీ) మెజార్టీ -  261

5. సూర్యనారాయణ గౌడ(వైసీపీ) మెజారిటీ - 186

6. శ్రీలక్ష్మి (వైసీపీ) మెజారిటీ - 264

7.  లక్ష్మణ్ రావు (వైసీపీ) మెజారిటీ-- 465

8. సాయి గీత (వైసీపీ) మెజారిటీ-- 434

9. బి అనిత (వైసీపీ) మెజారిటీ-- 290

10. టి వెంకట రమణమ్మ ( టిడిపి) మెజారిటీ-- 17

11. పి ఈశ్వరమ్మ(వైసీపీ) మెజారిటీ-- 313

12. బి నాగమణి (టిడిపి)-78

13. డి లక్ష్మీ నరసమ్మ (టిడిపి) మెజారిటీ-- 08

14. సి సరస్వతి (వైసీపీ) మెజారిటీ-- 180

15. పవన్ కుమార్ (వైసీపీ) మెజారిటీ-- 244

16. ఆర్ కవిత (వైసీపీ) మెజారిటీ-- 98

17. గంగుల జయప్ప (టిడిపి) మెజారిటీ-- 13

18. డి పరశురామ్ నాయక్ (వైసీపీ) మెజారిటీ-- 129

19. బి లక్ష్మీదేవి (వైసీపీ) మెజారిటీ- 196

20. రత్నప్ప చౌదరి (టిడిపి) మెజారిటీ- 73

గుంటూరు కార్పోరేషన్ లోనూ వైసిపి విజయబావుటా ఎగరేసింది. అధికార వైసిపి 44డివిజన్లలో విజయం సాధించగా టిడిపి 8, జనసేన 2, వైసిపి రెబల్ అభ్యర్థులు 2 చోట్ల గెలుపొందారు. 

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో మొదటి రౌండ్ ముగిసేసరికి అధికార వైసిపి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 23 డివిజన్ల ఫలితాలు వెలువడగా 19 చోట్ల టిడిపి, 4డివిజన్లలో టిడిపి విజయం సాధించింది. టిడిపి కేవలం 9,11,13,45 డివిజన్లలో గెలుపొందగా మిగతా డివిజన్లంటిలో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. 

రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసిపి దూసుకుపోతోంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం టిడిపి ఆధిక్యాన్ని సాధించింది. 36 వార్డులకు గాను టిడిపి 14, వైసిపి 8 చోట్ల విజయం సాధించింది. మరో 14చోట్ల టిడిపి ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  

విజయవాడ 11డివిజన్ నుండి పోటీచేసిన టిడిపి మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. 

విజయవాడలోనూ వైసిపి హవా కొనసాగుతోంది. వైసిపి 8, టిడిపి 3 డివిజన్లలో విజయం సాధించింది. టిడిపి మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ముందంజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

వైజాగ్ ఎన్నికల ఫలితాలు...మొదటి రౌండ్ లో పార్టీలు లీడ్... డివిజన్ల వారిగా

వైసీపీ లీడ్  6, 7, 8, 9,17,20, 21, 22,23, 24,25, 41,42,44,57, 64, 66, 74, 81, 82, 83, 84, 87, 91, 92, 93, 95 వార్డులు
                                                                                
టీడీపీ లీడ్  ..10,18, 48,59,62,68, 69,75,88  వార్డులు                                                                 

బీజేపీ, జనసేన లీడ్ ---47, 58 వార్డులు.
 

వినుకొండలో గెలిచిన అభ్యర్థులు 
1 యర్రం నాగేశ్వరి వైసిపి
2 బత్తుల వీరమ్మ   వైసిపి
3 దేవల్ల అంజమ్మ  వైసిపి
4 జామున ఇందుమతి  వైసిపి
5 పోలూరి అంజలీ దేవి టిడిపి
6 గంధం కృష్ణవేణి వైసీపీ(ఏకగ్రీవం)
7 పత్తి వేదవతి.   టిడిపి
8 పాపసాని బ్రహ్మయ్య వైసీపీ
9 రెడ్డి నాగ పద్మ వైసీపీ(ఏకగ్రీవం)
10  బేతం గాబ్రియల్ వైసిపి
11 నీలిమ కిష్టం వైసిపి
12 పులి నాగరాజు టిడిపి
13 షేక్ దిల్షాద్ వైసిపి
14 మురికపూడి జయరాజ్ వైసిపి
15 షేక్ దస్తగిరి వైసిపి
16 సానాల పుల్లయ్య వైసిపి
17 దర్గా రహన సుల్తానా వైసిపి
18 పాల్వాది ప్రసన్నంజనేయులు వైసిపి
19 M బాషా వైసిపి
20 నంది అంజనీ వైసిపి
21 గర్రె శ్రీనివాసరావు వైసిపి
22 CH మహబూబి వైసిపి
23 T నన్నేసా వైసిపి
24 స్క్ గౌస్ బాషా వైసిపి
25 తెల్లాకుల రాజేష్ ఖన్నా వైసిపి
26 గంటా కాలేష వైసిపి(ఏకగ్రీవం)
27 I హేమలత వైసిపి
28 బత్తుల పద్మావతి వైసిపి (ఏకగ్రీవం)
29 పఠాన్ మల్లికా బేగం వైసిపి(ఏకగ్రీవం)
30 షేక్ షకీలా వైసిపి(ఏకగ్రీవం)
31 M లక్ష్మీరెడ్డి వైసీపీ(ఏకగ్రీవం)
32 V లింగమూర్తి టిడిపి

కర్నూల్ కార్పోరేషన్ ను కూడా వైసిపి కైవసం చేసుకుంది. 

ఒంగోలు మున్సిపల్ కార్సోరేషన్ లోనూ అధికార వైసిపి ఘన విజయం సాధించింది.  మొత్తం 50 డివిజన్లకు గాను వైసిపి 41, టిడిపి 6, జనసేన 1, ఇతరులు 2చోట్ల విజయం సాధించారు. 

 రేపల్లె  మున్సిపాలిటీని వైసిపి చేజిక్కించుకుంది. మొత్తం 28 వార్డుల్లో వైసిపి 25, టిడిపి 2,ఇతరులు 1 సాధించారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే జోగారావును అనుమతించి ఎమ్మెల్సీ జగదీష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో పోలీసులు అతన్ని పక్కకు తోసేయడంతో చొక్కా చినిగిపోయింది. 

తిరుపతి కార్పోరేషన్ లో వైసిపి విజయబావుటా ఎగరేసింది. ఇక్కడి 50డివిజన్లకు గాను అధికార వైసిపి 48 చోట్ల వైసిపి విజయాన్ని దక్కించుకుంది. నామినేషన్ల దశలోనే అధిక డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్న వైసిపి తాజా ఫలితాల్లో మరిన్ని డివిజన్లలో గెలిచి కార్పోరేషన్ ను కైవసం చేసుకుంది. 

నర్సాపురం  మున్సిపాలిటీని వైసిపి చేజిక్కించుకుంది.  మొత్తం 31వార్డులకు గాను వైసిపి 16 చోట్ల విజయం సాధించింది.  

విజయవాడ కార్పోరేషన్ లోపోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 23 డివిజన్లలో మొత్తం 251 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను వైసీపీ 143 ,టీడీపీ 45,జనసేన 31,బీజేపీ 7, సీపీఐ 4, సీపీఎం 1, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 4, నోటా 9, చెల్లని ఓట్లు 3 పడ్డాయి.

చిలకలూరిపేట మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డులకు గాను ఇప్పటివరకు 30 వార్డులు వైసీపీ కైవసం చేసుకుంది. 

తాడిపత్రి మున్సిపాలిటీలోని 24 వార్డులో టిడిపి అభ్యర్థి జెసి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. 1200 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని అందుకున్నారు. 

గిద్దలూరు నగర పంచాయతీ 20వార్డుల్లో గెలిచిన అభ్యర్థులు...
వార్డు  - అభ్యర్థి - పార్టీ పేరు
1వ వార్డు-ఆర్డీ రామకృష్ణ(ఏకగ్రీవం)-వైసీపీ

2వ వార్డు-బి. చంద్రశేఖర్-టీడీపీ

3వ వార్డు-పాలుగుళ్ల శ్రీదేవి-టీడీపీ

4వ వార్డు-వినుకొండ మరియమ్మ-వైసీపీ

5వ వార్డు-పరుచూరి సుభాషిణి(ఏకగ్రీవం)-వైసీపీ

6వ వార్డు-గర్రె సునీత-వైసీపీ

7వ వార్డు-బిల్లా లక్ష్మీదేవి-టీడీపీ

8వ వార్డు-గడ్డం భాస్కరరెడ్డి-వైసీపీ

9వ వార్డు-ముద్దర్ల లక్ష్మీదేవి-వైసిపి

10వ వార్డు-పోలేపల్లి పద్మావతి-వైసీపీ

11వ వార్డు-లోక్కు రమేష్(ఏకగ్రీవం)-వైసీపీ

12వ వార్డు-పఠాన్ ఖాదర్ ఖాన్-వైసీపీ

13వ వార్డు-మానం బాలిరెడ్డి(ఏకగ్రీవం)-వైసీపీ

14వ వార్డు-నాసరి సుభాషిణి-వైసీపీ

15వ వార్డు-దేమా చౌడేశ్వరీ(ఏకగ్రీవం)-వైసీపీ

16వ వార్డు-పాముల వెంకటసుబ్బయ్య(ఏకగ్రీవం)-వైసీపీ

17వ వార్డు-దొంతా లక్ష్మీదేవి-ఇండిపెండెంట్

18వ వార్డు-షేక్ హసీనా-వైసీపీ

19వ వార్డు-కాతా దీపికా(ఏకగ్రీవం)-వైసీపీ

20వ వార్డు-సాయిపోగు రిబ్కా-వైసీపీ

తాడిపత్రి మున్సిపాలిటీలో టిడిపి అభ్యర్థి జేసి ప్రభాకర్ రెడ్డి వెయ్యి ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. 

అమలాపురంలో జనసేన మంచి ఫలితాలను సాధించింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 4చోట్ల జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. 

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘానికి 2 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. మొత్తంగా 25 వార్డులు ఉన్న నాయుడుపేట పురపాలక సంఘంలో ఇప్పటికే 23 ఏకగ్రీవం అయ్యాయి. వైసిపి 21, తెదేపా 1, భాజపా 1 స్థానం సొంతం చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు అనంతరం వైకాపా మొత్తంగా 23 స్థానాలు సొంతం చేసుకుని.. పురపాలక సంఘాన్ని సొంతం చేసుకుంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి 11వ వార్డులో ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. ఈ వార్డులో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపికి సమానంగా ఓట్లు వచ్చాయి. 

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని మొత్తం 20 వార్డులకు గాను అధికార వైసిపి 18, టిడిపి 2 చోట్ల విజయం సాధించింది. 

అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ ఫలితాల్లో వైసిపి దూసుకుపొతోంది. 20 వార్డుల్లో 16 చోట్ల వైసిపి అభ్యర్థులు విజయం. 

ఏపీలో నాలుగు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ముగిసింది.   

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని మొత్తం 23 వార్డుల్లో వైసిపి 15, టిడిపి 8 కైవసం. 

డోన్ లో వైసిపి 31,ఇతరులు 1 చోట గెలుపొందారు.

ఆత్మకూరులో వైసిపి 23 వార్డుల్లో వైసిపి,1చోట ఇతరులు గెలుపు. 

కనిగిరిలో ఏకగ్రీవాలతో కలిపి 20 వార్డుల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. 

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీ మొదటి పది వార్డుల పలితాలు వెలువడ్డాయి. ఇందులో 2 ,3.,4.,5.,7,8 వార్డుల్లో వైసిపి,  1,6,10 వార్డు ల్లో టిడిపి విజయం సాధించింది. 9 వార్డులో వైసిపి రెబల్ అభ్యర్థి గెలుపొందారు. 

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు వైసిపి అభ్యర్థి బెల్లాల శ్రీనివాసరావు విజయం సాధించారు. మొత్తం 800 ఓట్లు పోలవగా వైసిపికి 412, టిడిపి 350, బీజేపీ 23 ఓట్లు వచ్చాయి. 

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం 3వ వార్డులో జనసేన విజయం సాధించింది. 

వైసిపి ఖాతాలోకి ఇప్పటికే 15 మున్సిపాలిటీలు చేరాయి. ఎన్నికలకు ముందే  నాలుగు మున్సిపాలిటీలు వైసిపి కైవసం చేసుకోగా తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో మరికొన్ని వైసిపి ఖాతాలో చేరాయి.

ముమ్మిడివరం మున్సిపాలిటీ 8వ వార్డులో వైసిపి అభ్యర్థి విజయం సాధించింది. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం  మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి గెలుపు. 

గిద్దలూరు మున్సిపాలిటీ కూడా అధికార వైసిపి వశమయ్యింది. ఇక్కడ మొత్తం 20 వార్డులకు గాను వైసిపి 13 వార్డులను గెలుచుకుంది. 

కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలు వైసిపి కైవసం చేసుకున్నాయి. గిద్దలూరులో కూడా వైసిపి విజయం సాధించింది. కనిగిరిలోని మొత్తం 20 వార్డుల్లోనూ విసిపి విజయం సాధించింది. 

ఆదోని కౌటింగ్ కేంద్రం  వద్ద గందరగోళం నెలకొంది. అభ్యర్థులతో పాటు ఇద్దరు ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి పంపించాలని పార్టీల నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఓవైపు ఓట్ల లెక్కింపు  జరుగుతుండగానే విశాఖలోని11వ డివిజన్  జనసేన అభ్యర్థి బోను భారతి గుండెపోటుకు గురయి మృతి చెందారు. 

తునిలో మొత్తం 30వార్డుల్లో 15చోట్ల అధికార వైసిపి ఆధిక్యం కొనసాగుతోంది. 

ధర్మవరంలో మొత్తం 40వార్డుల్లో ఇప్పటికే వైసిసి 10చోట్ల ఆదిక్యంలో వుంది.

ఎమ్మిగనూరులో రెండు చోట్ల అధికార వైసిపి ఆధిక్యం కొనసాగుతోంది. 
 
ఆళ్లగడ్డలో 8చోట్ల వైసిపి ఆధిక్యంలో వుంది. 

ఏపీలో ఇటీవల ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ, కార్పోరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటికే అన్ని పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల్లోకి చేరుకున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్‌లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376 మంది, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ఎన్నికల సంఘం నియమించింది.  

ఆదివారం 8గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభంకానుంది.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని ఎస్ఈసీ అధికారులకు సూచించారు. రాత్రి 8గంటల వరకు అన్నిచోట్ల పూర్తి ఫలితాలను వెల్లడించాలని ఈసీ సంబందిత అధికారులను ఆదేశించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios