అమరావతి: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో నారా లోకేష్ తోపాటు చంద్రబాబు నాయుడు కేబినేట్లోని మంత్రులంతా ఓడిపోవడం ఖాయమన్నారు. 

మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ దారుణంగా ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు మంత్రులు పితాని సత్యనారాయణ, చినరాజప్ప, నారాయణ, జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతోపాటు మెుత్తం కేబినేట్ లోని మంత్రులంతా ఓటమి పాలవ్వడం ఖాయమన్నారు. 

మే 23 తర్వాత వారి పని ఇక ముగిసినట్లేనని సి.రామచంద్రయ్య చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకే బలంగా ఫ్యాన్ కు ఓట్లు వేశారని సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కొద్ది రోజులైనా ఊహాలోకంలో బతుకు, చంద్రబాబూ ! : వైసీపీ నేత సి. రామచంద్రయ్య