Asianet News TeluguAsianet News Telugu

ఫిరాయింపు అభ్యర్థుల నియోజకవర్గాల్లో టీడీపీ భారీ విజయం: మంత్రి సోమిరెడ్డి


పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరైతే పార్టీ వీడారో ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 
 

ap minister somireddy chandramohan reddy comments on Crossover leaders
Author
Amaravathi, First Published Feb 16, 2019, 3:35 PM IST


అమరావతి: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు సూచనలు చేశారని తెలిపారు. 

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేక స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరైతే పార్టీ వీడారో ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 

కేవలం ఒకరిద్దరు మాత్రమే పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని కేవలం 2శాతం మంది పోయినంత మాత్రాన ఒరిగే నష్టం ఏమీ లేదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కులం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణకు తగిన గౌరవం ఇవ్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీపై మాట్లాడుతుందా అంటూ మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు, అలాగే ప్రతీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు అందరి వాడు అనిపించుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ కూడా ప్రవేశపెట్టలేదు : మంత్రి సోమిరెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios