Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బర్డ్ ఫ్లూ ఆందోళన: మంత్రి అప్పలరాజు చిట్కాలు ఇవీ...

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో ఏపీలో బర్డ్ ఆందోళన చోటు చేసుకుంది. ఈ స్థితిలో బర్డ్ ఫ్లూ ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు వివరించారు.

AP minister Seediri Appalaraju suggestions to face bird flu
Author
amaravati, First Published Jan 7, 2021, 6:40 PM IST

అమరావతి: కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని తెలిసిందే, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బర్డ్ ఫ్లూను ఎదుర్కోవడానికి ఈక్రింది చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు.

ఒక్కొక్క బృందంలో ఒక పశువైద్యుడు, ఇద్దరు పారా వెటర్నరీ సిబ్బంది, ఇద్దరు సహాయకులు ఉంటారు.

మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలిపి 829 బృందాల ఏర్పాటుకు ఆదేశించి పరిస్థితి ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో స్పందించడానికి సిద్ధంగా ఉండాలి.

వీటితో పాటుగా ప్రతీ జిల్లాలో ఉన్న కోళ్ల సంఖ్యను బట్టి 40 నుంచి 140 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వస్తున్న నేపథ్యంలో నెల్లూరు, గుంటూరు , పశ్చిమగోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలలో అదనంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 బెంగుళూరులో ఏర్పాటైన దక్షిణ భారత ప్రాంతీయ పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ, నివారణ, నిరోధకతపై శిక్షణ పొందిన 5 గురు పశువైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

విజయవాడలోని పశువ్యాధి పరిశోధనా కేంద్రం, బెంగుళూరులోని దక్షిణ భారత ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలలో రక్త మరియు విసర్జన సమూనాలను పరిక్షించడం ద్వారా వ్యాధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం,  శ్రీకాకుళం జిల్లాలో చనిపోయిన కాకుల నుండి సేకరించిన నమూనాలను విజయవాడలోని పశువ్యాధి పరిశోధనా కేంద్రంలో పరీక్షించిన మీదట బర్డ్ ఫ్లూ లేదని నిర్ధారించడమైనది. 

మన రాష్ట్రములోని అన్ని పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎదుర్కోవడానికి అవసరమైన సామగ్రిని అనగా N-95 మాస్క్ లు, గ్లోవ్స్, అప్రాన్స్, ఫార్మలిస్, సున్నం వంటి వాటిని సిద్ధంగా ఉంచాం. మరియు పశుసంవర్ధక శాఖ సత్వర స్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, అటవీశాఖ సిబ్బందికి బర్డ్ ఫ్లూ వ్యాధి సన్నద్ధతపై శిక్షణ ఇస్తున్నాం.

పశుసంవర్ధక శాఖ సిబ్బందితో పాటు, పంచాయతీ రాజ్ శాఖ, అటవీ శాఖ సిబ్బంది పౌల్లీ రైతులకు, పౌల్జీ వ్యాపారులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నాం.

ప్రతి జిల్లాలోని సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు విధముగా అందరినీ అప్రమత్తం చేస్తున్నాం.

అన్ని జిల్లాల కలెక్టర్ లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సన్నద్ధత గురించి విధి విధానాలను తెలియపరిచాం. జిల్లా యంత్రాంగాన్ని అవరసమైన సామగ్రితో అప్రమత్తం చేశాం.

కోళ్ళు, కోడి గ్రుడ్లను రవాణా చేసే వాహనాలపై నిఘా ఉంచాం. ప్రతి మండలంలో ఎక్కువ సంఖ్యలో పెరటి కోళ్ళు, పౌల్ట్రీ ఫారాలు ఉన్న గ్రామాలను మాపింగ్ చేసి పర్యవేక్షిస్తున్నాం.

మంత్రి చెప్పిన జాగ్రత్తలు ఇవీ...

ఈ వ్యాధిని నివారించడంలో కఠినమైన జీవభద్రతా చర్యలే ప్రధమ రక్షణ, వ్యక్తి గత పరిశుభ్రత, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించగలం.

పూర్తిగా ఉడికించిన కోడి గ్రుడ్లు, మాంసం తినడం ద్వారా బర్డ్ ఫ్లూ రాదని, కావున ఎటువంటి అపోహలకు గురికాకుండా మాంసం, గ్రుడ్లను ఆహారముగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios