జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  ఏపీ మంత్రి రోజా  విమర్శలు చేశారు.  నిన్న జగన్ పై  పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు  మంత్రి రోజా కౌంటరిచ్చారు.


తాడేపల్లి:చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చి గంతులేస్తున్నాడని  ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా  సెటైర్లు వేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  పవన్ కళ్యాణ్  నిన్న విమర్శలు చేశారు.ఈ విమర్శలకు  మంత్రి  రోజా కౌంటరిచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ పనికిమాలినవాడని ఆమె విమర్శించారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ లో దాక్కున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

also read:మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్

 మీకు చప్పట్లు కొట్టేవారికి  కోవిడ్ సమయంలో సేవలందించింది  వలంటీర్లేనన్నారు. పవన్ సంస్కారం  గురించి చెప్తుంటే  సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుందని ఆమె విమర్శించారు.  ఎవరి మాటను  విననందునే  పవన్ కళ్యాణ్ ను భార్యలు వదిలేశారన్నారు.బ్యాంకులు ,మీ సేవా కేంద్రాలు కూడ వివరాలు అడుగుతాయన్నారు. డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని మోడీని అనగలవా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ కేసులో  టాప్ టెన్ జాబితాలో ఉన్న తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రశ్నించే దమ్ముందా  అని  రోజా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నిన్న పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.  జగన్ రౌడీ పిల్లాడు. జగ్గుభాయ్  అంటూ వ్యాఖ్యలు చేశారు. జగ్గుభాయ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో  తెలుసునన్నారు. జగన్ పై  ప్రధాని నరేంద్ర మోడీకి  ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. జగన్ పై  ఇక్కడే తేల్చుకుంటామని  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై  వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై  విరుచుకుపడుతున్నారు.