విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వారు విశాఖపట్నంలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా వదలజడం లేదు. పుష్ప శ్రీవాణి భర్త పరిక్షిత్ రాజు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 14,996 కరోనాకేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 13,02,589కి చేరుకొన్నాయి. కరోనాతో ఒక్క రోజులోనే 81మంది మరణించారు.కరోనాతో పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖపట్టణంలో 9 మంది, నెల్లూరు, విజయనగరంలలో 8మంది చొప్పున చనిపోయారు.చిత్తూరు, కర్నూల్ లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళంలలో నలుగురి చొప్పున, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8791కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో అనంతపురంలో 639, చిత్తూరులో 1543, తూర్పుగోదావరిలో2352, గుంటూరులో1575, కడపలో1224, కృష్ణాలో666, కర్నూల్ లో948, నెల్లూరులో 1432, ప్రకాశంలో 639, శ్రీకాకుళంలో,  1298,విశాఖపట్టణంలో1618, విజయనగరంలో 629, పశ్చిమగోదావరిలో 429 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనా నుండి 16,167 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,04,431 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,28,059 మంది నుండి శాంపిల్స్ సేకరించారు.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-99,416, మరణాలు 732
చిత్తూరు-1,41,480, మరణాలు 1033
తూర్పుగోదావరి-1,65,545, మరణాలు 781
గుంటూరు -1,22,097, మరణాలు 791
కడప -73138, మరణాలు 502
కృష్ణా -70,624 మరణాలు 818
కర్నూల్ -93,646, మరణాలు 601
నెల్లూరు -94,329, మరణాలు 664
ప్రకాశం -83,607, మరణాలు 675
శ్రీకాకుళం-86,654, మరణాలు 436
విశాఖపట్టణం -99,437, మరణాలు 735
విజయనగరం -58,910, మరణాలు 376
పశ్చిమగోదావరి-1,10,811 మరణాలు 647