గవర్నర్‌కి నిమ్మగడ్డ లేఖ: మంత్రి పేర్నినాని ఫైర్
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం విచిత్రంగా ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
అమరావతి:పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం విచిత్రంగా ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
బుధవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ శ్రీరంగ నీతులు చెబుతున్నట్టుగా ఉందని ఆయన సెటైర్లు వేశారు.మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని సూర్యనారాయణలతో నిమ్మగడ్డ రహస్య మంతనాలు జరపలేదా అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయాలకు ఎస్ఈసీ దూరంగా ఉండాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన చెప్పారు.టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం పెట్టి కేంద్రానికి పంపిన వ్యక్తి నిమ్మగడ్డ అని ఆయన తెలిపారు. కుక్కనూరు, ఏలేరుపాడులో ఎన్నికలు వాయిదా వేయించిన చరిత్ర నిమ్మగడ్డది అని ఆయన మండిపడ్డారు.
ఇవాళ సాయంత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థా.ంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సహానీ హయంలో ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి.