తిరుపతి: ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని ఏపీరాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
చంద్రబాబు ప్రచార సభలో రాళ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

also read:తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు

తిరుపతిలో సోమవారం నాడు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీ స్థానంలో ఓడిపోతామని తెలిసిపోవడంతో రాళ్లు రువ్వారని చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు.రాళ్లు విసిరిన వాళ్లు ఎవరో పోలీసులు తేలుస్తారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆయన పోలీసులను కోరారు. రాళ్ల దెబ్బతగిలిన వారు ఎవరు చెప్పడం లేదన్నారు.  రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై పోలీసులు వాస్తవాలను వెలికితీయాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు.