Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ పవర్‌పుల్ స్టార్ అనుకొన్నా...: లోకేష్ సెటైర్లు

పవర్ స్టార్ పవర్‌ఫుల్ అనుకొన్నా....ఆయన పవర్ ఏమిటో తేలిపోయిందని  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తనపై విపక్షాలు చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని  ఆయన సవాల్ విసిరారు.

Ap minister NaraLokesh challenges to opposition parties over corruption allegations
Author
Guntur, First Published Aug 28, 2018, 5:51 PM IST


గుంటూరు: పవర్ స్టార్ పవర్‌ఫుల్ అనుకొన్నా....ఆయన పవర్ ఏమిటో తేలిపోయిందని  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తనపై విపక్షాలు చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని  ఆయన సవాల్ విసిరారు.

మంగళవారం నాడు  గుంటూరులో నిర్వహించిన  నారా హమారా టీడీపీ హామారా సభలో  ఆయన ప్రసంగించారు. విపక్షాలపై లోకేష్ మండిపడ్డారు. తనపై విపక్షాలు చేసిన ఆరోపణలపై ఆయన మరోసారి సవాల్ విసిరారు. తాను పుట్టే సమయానికే  ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని చెప్పారు. తాను స్కూల్ కు వెళ్లే సమయంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు.

ఏనాడూ కూడ తనపై ఆరోపణలు రాలేదన్నారు.  కానీ, తనపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.  తనపై తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ప్రజల ముందు రుజువు చేయాలని లోకేష్ సవాల్  విసిరారు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఢిల్లీలో ఉండి మద్దతును కూడగడుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎటు వెళ్లాడని లోకేష్ ప్రశ్నించారు. పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలుసునని చెప్పారు. కానీ, కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో  పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

కర్ణాటక ఎన్నికల్లో  బీజేపీకి ట్రైలర్ మాత్రమే చూపించారన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలు  బీజేపీకి సినిమా  చూపిస్తారని లోకేష్ చెప్పారు. తెలుగుజాతితో పెట్టుకొన్న వారెవరూ కూడ  బాగుపడలేదన్నారు. రాష్ట్రంలోని  25 ఎంపీలను, 175 ఎమ్మెల్యేలను గెలిపిస్తే  జాతీయ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబునాయుడు చక్రం తిప్పుతారని ఆయన చెప్పారు.

రానున్న రోజుల్లో ప్రధానిని  చంద్రబాబునాయుడు నిర్ణయించనున్నారని లోకేష్ జోస్యం చెప్పారు. ఎన్నకిలు వస్తున్న తరుణంలో  ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు. ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios